శబరిమల ఆలయంలో గోల్డ్ మాయం కేసు.. సిట్ కు అప్పగింత

శబరిమల ఆలయంలో గోల్డ్ మాయం కేసు.. సిట్ కు అప్పగింత

శబరిమల ఆలయంలో బంగారుం చోరీ కేసు కీలక మలుపుతిరిగింది. సోమవారం(అక్టోబర్6) ద్వార పాలక విగ్రహాలనుంచి బంగారం చోరీకి గురై కేసు ను సిట్​ కు అప్పగించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఎస్పీ స్థాయి అధికారులు సైబర్​ యూనిట్​తో ప్రత్యేక బృందం ఈ కేసులో విచారణ చేపట్టనుంది. కేసు దర్యాప్తును గోప్యంగా ఉంచాలని కోర్టు సూచించింది. 

ఇటీవల ద్వారపాలకుల విగ్రహాల తాపడాల బంగారం బరువు తగ్గడంపై కేరళలో వివాదాస్పదమైంది. సెప్టెంబర్ 18న కేరళ హైకోర్టులో ఈకేసుపై విచారణ జరిగింది. దీనిపై విజిలెన్స్‌ కమిటీ దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు  ఆదేశించింది. 

అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి) హెచ్ వెంకటేష్‌ను సిట్ అధిపతిగా నియమించింది హైకోర్టు. అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) శశిధరన్ ఐపిఎస్ విచారణకు నేతృత్వంలో వివిధ పోలీస్  ఇన్​ స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లతో సహా రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్​ బృందాన్ని ఏర్పాటు చేసింది హైకోర్టు. 

►ALSO READ | బీహార్ఎన్నికల్లో సరికొత్త పెట్రోలింగ్..గుర్రాలు,పడవలపై

విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారు పూత పనిని అప్పగించిన వ్యక్తి ఆ పనిలో మిగిలిపోయిన బంగారాన్ని ఓ పెళ్లికి ఉపయోగించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) అధ్యక్షుడికి ఇమెయిల్ పంపారని తేలింది. దీంతో కోర్టుఈ కేసు ను సిట్​కు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.శుక్రవారం చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ తన రిపోర్టును సమర్పించిన తర్వాత దర్యాప్తును చేపట్టాలని కోర్టు సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు చేస్తున్నప్పుడు SIT ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, నెలలోపు దర్యాప్తును పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. 

బంగారం ఎలా మయం అయింది.. 

2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించేందుకు పాత రాగి రేకులను తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే, పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 5 కోట్ల విలువైన బంగారం మాయం కావడంపై సెప్టెంబర్​ 18, 2025న సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈకేసును సిట్​ కు అప్పగించింది.