శబరిమల అయ్యప్ప అలయంలో బంగారం చోరీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఆలయం ఆస్తుల దుర్వినియోగం, మనీలాండరింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా మంగళవారం (జనవరి 20) మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ విస్తృత సోదాలు నిర్వహించింది.
కర్ణాటక,కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి సంబంధించిన ఇండ్లు, ఆఫీసులు, ట్రావెన్ కోర్ దేవస్యం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ ఇండ్లు , కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.
ALSO READ : గద్దర్ అవార్డుల కోసం ఫిబ్రవరి 3 లోగా అప్లై చేసుకోండి
ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆదాయ మార్గాలు, బంగారం చోరీ ద్వారా పొందిన లాభాలకు సంబంధించిన కీలక డిజిటల్ డేటా, పలు డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
కేరళ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇటీవల ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే కేరళ హైకోర్టు పర్యవేక్షణలో రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.
ALSO READ : జస్ట్ ఒక్క రాత్రిలో రూ.10 వేలు పెరిగిన వెండి..
దర్యాప్తులో భాగంగా మంగళవారం శబరిమల ఆలయంలోని గర్భగుడిలో SIT అధికారులు ద్వారపాలకుల తొడుగులపై ఉన్న బంగారు ఆభరణాలను తూకం వేసి పరిశీలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు మరింత విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
