కొనే దమ్ముందా : జస్ట్ ఒక్క రాత్రిలో రూ.10 వేలు పెరిగిన వెండి.. ఇప్పుడు కిలో ఎంతో తెలుస్తే అవాక్కవుతారు..!

కొనే దమ్ముందా : జస్ట్ ఒక్క రాత్రిలో రూ.10 వేలు పెరిగిన వెండి.. ఇప్పుడు కిలో ఎంతో తెలుస్తే అవాక్కవుతారు..!

సంక్రాంతి పండగ తర్వాత బంగారం, వెండికి డిమాండ్ తగ్గుతుందని రేట్లు కొంత దిగొస్తాయని చాలా మంది సాధారణ భారతీయ మధ్యతరగతి కుటుంబాలు అనుకున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తుంటే సీన్ మెుత్తం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. అసలు బంగారం కంటే వెండి పెరుగుతున్న స్పీడు చూస్తున్నవారు అరే ఇలా అయితే అసలు భవిష్యత్తులో వెండిని కొనగలమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు రాత్రి గడిచే లోపే వెండి రేటు రిటైల్ మార్కెట్లలో రూ.10వేలు పెరగటమే ఆందోళనలకు కారణంగా మారింది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలేనని నిపుణులు అంటున్నారు. షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ ప్రాంతంలోని తాజా రేట్లను ముందుగా గమనించి నిర్ణయం తీసుకోండి. 

ALSO READ : స్మాల్ క్యాప్ ఫండ్స్ లో..

జనవరి 20న సంక్రాంతి పండుగ రోజున బంగారం రేట్లు పెరిగి కొనుగోలుదారులకు భారీగా షాక్ ఇస్తున్నాయి. దీంతో జనవరి 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.104 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 728గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 500గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : రిపబ్లిక్ డే స్పెషల్..

ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీ అదే దూకుడుతో కొనసాగుతోంది. ఒక్క రోజులోనే కేజీకి రూ.10వేలు రిటైల్ మార్కెట్లో పెరిగి నన్ను కొనే దమ్ము మీకు ఉందా అన్నట్లుగా కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే మంగళవారం జనవరి 20, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 30వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.330 వద్ద ఉంది.