తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. సాయంత్రం 5 గంటలకు శబరిమల ప్రధాన పూజారి మహేశ్ మోహనారు, ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) అధికారులు, వందలాది భక్తుల సమక్షంలో ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూతిరి అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరిచి, ప్రారంభ పూజ నిర్వహించారు.
గర్భగుడి నుంచి జ్వాలను తీసుకొచ్చి 18 మెట్ల వద్ద అధి (పవిత్ర మంట)ని వెలిగించారు. గుడి తలుపులు తెరిచినప్పుడు ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప స్వామి నామస్మరణలతో మారుమోగింది. అయితే, ఆలయ తలుపులు ఆదివారమే తెరుచుకున్నా.. భక్తులను సోమవారం నుంచి స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.
