
మీర్ పేట చందనం చెరువు వద్ద 75 ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణ
ఎల్‌బీనగర్ : దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలిసేలా వజ్రోత్సవాలను నిర్వహించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మహేశ్వరం సెగ్మెంట్ మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు వద్ద ఏర్పాటు చేసిన 75 ఫీట్ల అతి పెద్ద జాతీయ జెండాను ఆమె ఎగరవేశారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ గురించి భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతో గాంధీ సినిమాను ప్రదర్శించినట్లు తెలిపారు. వజ్రోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో మీర్‌పేట కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్‌లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ ఈగల విక్రం రెడ్డి, కార్పొరేటర్లు పద్మ, లావణ్య, బొక్క రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్లో వనమహోత్సవం
వికారాబాద్/ ఎల్‌బీనగర్ : స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్ గ్రామ పంచాయతీలో వన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ నిఖిల హాజరై మొక్కలు నాటారు.వజ్రోత్సవాలను సక్సెస్ చేసిన జిల్లా వాసులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరికీ ఆమె థ్యాంక్స్ తెలిపారు. నేడు ముగింపు వేడుకలు ఉన్నందుకు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి ప్రోగ్రామ్ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్ పాల్గొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలను సక్సెస్ చేసిన రంగారెడ్డి జిల్లా వాసులు, ప్రజా ప్రతినిధులు,ఉద్యోగులు, యువత, ప్రతి ఒక్కరిని థ్యాంక్స్ చెబుతూ
కలెక్టర్ అమోయ్ కుమార్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.