ఇంటర్ స్టూడెంట్ల​కు ఎంసెట్,నీట్ ఆన్​లైన్​ కోచింగ్ 

ఇంటర్ స్టూడెంట్ల​కు ఎంసెట్,నీట్ ఆన్​లైన్​ కోచింగ్ 
  • ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇంటర్​ స్టూడెంట్స్​ను ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​కు రెడీ చేసేందుకు ఫ్రీగా ఆన్​లైన్ కోచింగ్ ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాద్​లో ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏసీపీటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ సెకండియర్ పూర్తయిన విద్యార్థులు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నిరుడు ఆన్​లైన్ ట్రైనింగ్​ లో తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల విద్యార్థులూ పేర్లు నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. http://tscie.rankrs.io లింక్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.