హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఏఐసీసీ సెక్రటరీగా మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు సచిన్ సావంత్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏఐసీసీ సెక్రటరీగా విశ్వనాథం ఉన్నారు.
ఆయనకు తోడుగా సచిన్ ను కూడా నియమించారు. ఈ ఇద్దరూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు సహాయకులుగా ఉంటారు. కాగా.. సచిన్ సావంత్ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేడర్ ను బలోపేతం చేయడానికి సచిన్ ను నియమించారు.
