
న్యూఢిల్లీ: లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ) ఈవెంట్‌లో ఇండియా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ పార్టిసిపేట్ చేయడం లేదు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ శనివారం స్పష్టం చేసింది. రిటైరైన ప్లేయర్లు ఆడే ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అయిన ఎల్‌ఎల్‌సీ ఈ నెల 20న స్టార్ట్ అవనుంది. ఈ ఈవెంట్‌లో మూడు టీమ్స్ పోటీ పడతాయి. ఇందులో ఒకటైన ఇండియా మహరాజాస్ టీమ్‌ను ఈ మధ్యే ప్రకటించారు. లీగ్‌కు ప్రమోషన్ కూడా మొదలైంది. అయితే, అమితాబ్ బచ్చన్ ఉన్న లీగ్ ప్రమోషనల్ వీడియోలో సచిన్ కూడా ఎల్‌ఎల్‌సీలో ఆడతాడని చూపించారు. కానీ, సచిన్ వ్యవహారాలు చూసే ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ దీన్ని ఖండించింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో సచిన్ పార్టిసిపేషన్ గురించి వస్తున్న న్యూస్ నిజం కాదని చెప్పింది. క్రికెట్ ఫ్యాన్స్‌ను, అమితాబ్ బచ్చన్‌ను ఆర్గనైజర్స్ ఇలా తప్పుదోవ పట్టించడం సరికాదని పేర్కొంది.