నాలుగేళ్లకోసారి డబ్ల్యూటీసీ ఉండాలి

నాలుగేళ్లకోసారి డబ్ల్యూటీసీ ఉండాలి

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌ కప్‌ మాదిరిగా.. వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ కూడా నాలుగేళ్లకు ఓసారి నిర్వహించాలని ఇండియా లెజెండ్​ సచిన్​ టెండూల్కర్​ సూచించాడు.  ఇందుకు  రెండు, మూడు నెలల విండో కేటాయించాలని ఐసీసీని కోరాడు. ‘డబ్ల్యూటీసీకి ఆదరణ పెంచితే.. వరల్డ్​కప్​లాగా అవుతుంది. వరల్డ్​కప్​ అన్ని దేశాల్లో నిర్వహించడం లేదు. ఒకటి, రెండు దేశాల్లోమాత్రమే ఆడతారు. అలాగే టెస్ట్ చాంపియన్​షిప్​ను నిర్వహించే దేశాలను​ను కూడా డిసైడ్​ చేయాలి. రెండు నెలల టైమ్​లో చాంపియన్​షిప్​ను కంప్లీట్​ చేసే విధంగా షెడ్యూల్​ను తయారు చేయాలి. అన్ని జట్లు పరస్పరం మ్యాచ్​లు ఆడాలి. అప్పుడు ఫైనల్స్​ను సింగిల్​గా నిర్వహించినా పెద్దగా ఇబ్బంది ఉండదు’ అని సచిన్​ అభిప్రాయపడ్డాడు.