
యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో నోటికొచ్చింది మాట్లాడే సునిశిత్ మరోసారి నోరుజారాడు. ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిశిత్.. 'జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో. కానీ ఆయన పోర్న్ సినిమాలు చేశాడు. ఈ విషయం టాలీవుడ్‌లో సునిశిత్ అనే హీరో తప్ప ఎవరూ చెప్పరని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఈ ఇంటర్వ్యూలో పలువురు సెలబ్రిటీల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసాడు సునిశిత్. 'బ్రహ్మానందంపై మర్డర్ కేసు ఉందని, మంచు విష్ణు, ప్రభాస్‌ల మీద రేప్ కేసులున్నాయని, హీరోయిజం చూపించి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారని కామెంట్ చేశాడు. ఇక సూపర్ స్టార్ మహేశ్‌బాబును డీఫేమ్ చేస్తున్నానని వాళ్లబ్బాయి గౌతమ్ తనతో గొడవపడ్డాడని, పేషియల్ చేయించుకోవడానికి మహేశ్‌బాబుతో యూఎస్ వెళ్లానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
ఈ వీడియోలు చూసినా హీరోల ఫ్యాన్స్ సునిశిత్ పై ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఇక నెటిజన్లు మాత్రం అతడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఉపాసన గురించి నోటికొచ్చింది వాగడంతో రామ్‌చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ను చితకొట్టారు.