
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయె చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ ఉమ్మడి మెదక్జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన ఆడబిడ్డలు ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మలు పెట్టి ఆడిపాడారు. అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.
సిద్దిపేట కోమటి చెరువు వద్ద హరీశ్‌రావు దంపతులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. హుస్నాబాద్పట్టణంలో ఎల్లమ్మ చెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అధికారులు కలిసి చెరువులో స్పీడ్ బోటు ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. – వెలుగు, న్యూస్ నెట్వర్క్