ఇవాళ(అక్టోబర్ 18) సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్ లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆంక్షలు

ఇవాళ(అక్టోబర్ 18) సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్ లో  ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆంక్షలు
  •     అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లో మళ్లింపులు
  •     మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమలు
  •     ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి: ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్​జోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు:  సద్దుల బతుకమ్మ నేపథ్యంలో ఆదివారం నగరంలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న బతుకమ్మ ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(రోటరీ చిల్డ్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వరకు వేడుకలు నిర్వహించనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసరాల్లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయడం, దారి మళ్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్బాలా మైదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు సాధారణ వాహనాలను అనుమతించబోమన్నారు. ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కట్టమైసమ్మ, డీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇందిరా పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా మళ్లిస్తామని చెప్పారు. ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి.వి. విగ్రహం నుంచి ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోటరీ వద్ద ప్రసాద్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐమ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు దారి మళ్లిస్తామన్నారు. నల్లగుట్ట, లిబర్టీ, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కవాడిగూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకూ ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు ఇలా..

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎంజీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే అంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఉపకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వైడబ్ల్యూసీఏ, సంగీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, బర్కత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుర, చాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా మళ్లిస్తారు. నగర సిటీ బస్సులను కర్బాలా మైదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బైబిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కవాడిగూడ, గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధోబీఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇందిరా పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కట్టమైసమ్మ మీదుగా పంపిస్తారు. ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి.వి. విగ్రహం, సైఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ తల్లి జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోటరీ, లిబర్టీ, రవీంద్రభారతి, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం, ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కవాడిగూడ, కర్బాలా మైదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాణిగంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్లగుట్ట తదితర ప్రాంతాల్లో రద్దీ ఉండే అవకాశం ఉందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జాయింట్​కమిషనర్​సూచించారు.

సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలో..

కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద ఆదివారం బతుకమ్మ వేడుకల నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్​ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. హైటెక్ సిటీ, మాదాపూర్, హఫీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ నుంచి కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వైపు, లక్కీ రెస్టారెంట్ సిగ్నల్ నుంచి కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ నాలుగో ఫేజ్ మీదుగా, రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బో విస్టా అంజయ్య నగర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్ మీదుగా ట్రాఫిక్​మళ్లింపులు ఉంటాయన్నారు. వాహనదారులు గమనించి, సహకరించాలని కోరారు.

కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలపండి 
బతుకమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తులు స్నో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియం, అమరవీరుల స్మారక స్థూపం, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లుంబినీ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు భాగం, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డులోని నిర్దేశిత ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని జాయింట్​సీపీ కోరారు. వేడుకలు ముగిసిన వెంటనే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆంక్షలను తొలగిస్తామని తెలిపారు. తాజా సమాచారం కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసుల ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాతాలను అనుసరించాలని, అత్యవసర సహాయం కోసం 90102 03626 ఫోన్​నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.