
హైదరాబాద్, వెలుగు: రైల్వే ఉద్యోగులు 13 మంది ‘ఎంప్లాయీ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులు దక్కించుకున్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ ఈ అవార్డులను అందజేశారు.
గుంతకల్ డివిజన్‌లో నలుగురు, సికింద్రాబాద్‌లో ముగ్గురు, హైదరాబాద్, విజయవాడలో ఇద్దరు చొప్పున, నాందేడ్, గుంటూరు డివిజన్‌లో ఒక్కొక్కరికి ఈ అవార్డులు లభించాయి. భద్రతా కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడం, రైలు ప్రయాణికుల భద్రతకు సంబంధించిన చర్యలు, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భద్రతా నియమాల అమలు చేయడంలో కృషి చేసినందుకుగాను ఈ 13 మందిని అవార్డులకు ఎంపిక చేసినట్లు జీఎం సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు.