
లలిత్‌పూర్ (నేపాల్): సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్20 చాంపియన్‌షిప్‌లో ఇండియా శుభారంభం చేసింది. 69వ నిమిషం నుంచి తొమ్మిది మందితోనే ఆడాల్సి వచ్చినా.. సోమవారం జరిగిన గ్రూప్–బి పోరులో ఇండియా 1–0తో భూటాన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. 37వ నిమిషంలో మోనిరుల్ మొల్లా ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్‌లో ఇండియా ఆధిపత్యం చూపెట్టగా.. సెకండాఫ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరగడంతో రిఫరీ మూడు రెడ్ కార్డులు ఇచ్చాడు. ఇందులో రెండు ఇండియాకు, ఒకటి భూటాన్‌కు ఇచ్చాడు. చివరి 20 నిమిషాలు ఇండియా తొమ్మిది మందితో, భూటాన్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది.