సఃకుటుంబ‌‌‌‌‌‌‌‌నాం.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్

సఃకుటుంబ‌‌‌‌‌‌‌‌నాం..  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్

రామ్‌‌‌‌‌‌‌‌ కిర‌‌‌‌‌‌‌‌ణ్‌‌‌‌‌‌‌‌, మేఘా ఆకాశ్ జంట‌‌‌‌‌‌‌‌గా న‌‌‌‌‌‌‌‌టిస్తున్న చిత్రం ‘సఃకుటుంబ‌‌‌‌‌‌‌‌నాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో   హెచ్‌‌‌‌‌‌‌‌.మ‌‌‌‌‌‌‌‌హాదేవ్ గౌడ‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌.నాగ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌త్నం నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాత ఏఎం.రత్నం క్లాప్ కొట్టగా, కొరియోగాఫ్రర్ చిన్ని ప్రకాష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ అని చెప్పాడు దర్శకుడు ఉదయ్.

‘అన్ని ఎమోషన్స్ ఉన్న పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ స్టోరీ ఇది. దీనికి కథే హీరో’ అని చెప్పాడు రామ్ కిరణ్.  ఇందులో సిరి అనే పాత్రలో కనిపిస్తానంది మేఘా ఆకాశ్​. కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రూపొందుతోన్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాతలు. శుభ‌‌‌‌‌‌‌‌లేఖ సుధాక‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, రాజేంద్ర ప్రసాద్‌‌‌‌‌‌‌‌, బ్రహ్మానందం, స‌‌‌‌‌‌‌‌త్య, రాహుల్ రామకృష్ణ, ర‌‌‌‌‌‌‌‌చ్చర‌‌‌‌‌‌‌‌వి, భ‌‌‌‌‌‌‌‌ద్రం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.