ఆధ్యాత్మిక కేంద్రంగా సహస్ర కుండ్

ఆధ్యాత్మిక కేంద్రంగా సహస్ర కుండ్
  • ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి కేవలం 50 కి.మీ
  • సహస్ర కుండ్ కి రైలు, రోడ్డు మార్గం
  • వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

మహారాష్ట్రలోని సహస్ర కుండ్ వాటర్ ఫాల్స్ సందర్శకులతో సందడిగా మరింది. జలపాతం దగ్గరికి వెళ్లి చూసేలా అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన కట్టడాలు కట్టడంతో చిన్న పెద్ద ప్రతి ఒక్కరు దగ్గర నుండి జలపాతం అందాలను వీక్షిస్తున్నారు. అక్కడి సర్కార్ జలపాతాల అభివృద్ధితో పాటు పర్యటకంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జలపాతం పరివాహక ప్రాంతంలో మద్యం మంసం నిషేదించడంతో పాటు అక్కడున్న ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయడంతో ప్రకృతి ప్రేమికుల సంఖ్య సహస్ర కుండ్ కి ఏటా పెరుగుతూ వస్తోంది.

కేవలం 50 కి.మీ దూరంలో..

సహస్ర కుండ్ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిణ్వట్ తాలుకలో ఉంది ఈ జలపాతం. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి కేవలం 50 కి.మీ దూరంలో ఉంది. సహస్ర కుండ్ కి రైలు, రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దగ్గరి నుండి చూసిచే పెద్ద బ్రిడ్జి, వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి ఒక్కరు వాటర్ ఫాల్స్ అందాలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

అభివృద్ధికి ఆమడ దూరంలో కుంటాల..

జలపాతం పరిసరాల్లో ఎక్కడ చెత్తాచెదారం కనిపించకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని కుంటాల, పొచ్చర, గాయత్రి వాటర్ ఫాల్స్ ను ఇలాగే అభివృద్ధి చేయాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో కుంటాల, పొచ్చర, గాయత్రి వాటర్ ఫాల్స్ ఉన్నాయని అంటున్నారు. సహస్ర కుండ్ తరహాలో అక్కడ కూడా బ్రిడ్జి నిర్మించాలని పర్యాటకుల డిమాండ్ చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు లేక మన వాటర్ ఫాల్స్ వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. సహస్ర కుండ్ అందాలతో పాటు ఏర్పాట్లపై పర్యటకుల సంతృప్తిగా ఉన్నారు. గతంలో సహస్ర కుండ్ ని రాష్ట్ర బృందం పరిశీలించింది. అక్కడి తరహాలో కుంటాల వద్ద బ్రడ్జి నిర్మించాలని పర్యాటక శాఖకు ప్రపోజల్ పెట్టింది.