పోచిరాజు సత్యవతికి  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

పోచిరాజు సత్యవతికి  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ట్రాన్స్​లేషన్ విభాగంలో ఎంపిక

న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ రచయిత్రి పోచిరాజు సత్యవతికి 2019 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ట్రాన్స్ లేషన్ విభాగంలో ఆమెను ఈ అవార్డు వరించింది. సత్యవతి రాసిన ‘తన పేరు మరచిపోయిన ఓ మహిళ’ కథ  వాట్ ఈజ్ మై నేమ్ పేరుతో ఇంగ్లిష్ లోకి అనువాదమై ప్రస్తుతం ఏపీలోని టెన్త్ ఇంగ్లిష్ బుక్ లో పాఠంగా ఉంది. మరో కథ ‘ విల్ హీ కమ్ హోమ్’ కూడ ఇంటర్ ఫస్టియర్ లో ఓ లెస్సన్ గా ఉంది. ఎ.రేవతి రాసిన ” ద ట్రూత్ ఎబౌట్ మి: ఏ హిజ్రా లైఫ్ స్టోరీ” ని సత్యవతి తెలుగులోకి అనువాదం చేశారు. సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు అనువాదం విభాగంలో వివిధ భాషలకు చెందిన 23 మంది రచయితలను కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపిక చేశారు. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విజేతలకు రూ. 50 వేల నగదు, తామ్రపత్రం అందజేస్తామని తెలిపారు.

నేడు అవార్డు అందుకోనున్న బండి నారాయణస్వామి

శప్తభూమి నవలా రచయిత బండి నారాయణస్వామి మంగళవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోనున్నారు. 2019 సంవత్సరానికి నారాయణస్వామికి ఈ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.