MLC 2025: ఒక్కడే 500 టీ20 మ్యాచ్ లు.. అరుదైన లిస్టులోకి ఇంగ్లాండ్ క్రికెటర్

MLC 2025: ఒక్కడే 500 టీ20 మ్యాచ్ లు.. అరుదైన లిస్టులోకి ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలెక్స్ హేల్స్ సొంత జట్టులో స్థానం కోల్పోయిన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీహ్స్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ మినహాయిస్తే ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ దాదాపు ప్రపంచంలోని అన్ని టీ20 లాగ్ లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో హేల్స్ ఒక అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో 500 మ్యాచ్ లాడిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్ గా నిలిచాడు. ప్రస్తుతం అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతుంది. ఈ సీజన్ లో 12 వ మ్యాచ్ సోమవారం (జూన్ 23) సియాటిల్ ఓర్కాస్, LA నైట్ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో హేల్స్ ఈ ఘనతను అందుకున్నాడు. 

నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న హేల్స్ తన 500 మ్యాచ్ లో కేవలం 1 పరుగే చేసి ఔటయ్యాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓవరాల్ గా 500 మ్యాచ్ లు ఆడిన ఏడో క్రికెటర్ గా హేల్స్ నిలిచాడు.  హేల్స్ కంటే ముందు కీరన్ పొలార్డ్ (699), డ్వేన్ బ్రావో (582), షోయబ్ మాలిక్ (557), ఆండ్రీ రస్సెల్ (556), సునీల్ నరైన్ (551), డేవిడ్ మిల్లర్ (530) 500 టీ20 మ్యాచ్ లాడారు. హేల్స్ ఆడిన 500 టీ20 మ్యాచ్ ల్లో 30 యావరేజ్ తో 13,730 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 7 సెంచరీలు ఉన్నాయి. హేల్స్ తర్వాత రవి బొపారా 486 మ్యాచ్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

డల్లాస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సియాటిల్ ఓర్కాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు షయాన్ జహంగీర్ (26), డేవిడ్ వార్నర్ (38) మంచి ఆరంభం ఇచ్చారు. ఆరోన్ జోన్స్ బోర్డులో 44 పరుగులు చేయగా.. షిమ్రాన్ హెట్మైర్ 19 పరుగులు పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో నైట్ రైడర్స్ జట్టు 18.2 ఓవర్లలో నాలు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఉన్ముక్త్ చంద్ 86 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సైఫ్ బదర్ 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.