Gold Rate: యుద్ధాన్ని లెక్కచేయని గోల్డ్.. భారీగా పతనం, హైదరాబాదులో రూ.లక్ష కిందకి తులం..

Gold Rate: యుద్ధాన్ని లెక్కచేయని గోల్డ్.. భారీగా పతనం, హైదరాబాదులో రూ.లక్ష కిందకి తులం..

Gold Price Today: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ తర్వాత చాలా దేశాలు ఇరాన్ కు బాసటగా నిలిచేందుకు జెంకుతున్నాయి. అండ కేవలం మాటలకే పరిమితం కావటం.. నేరుగా యుద్ధంలోకి ఎవ్వరూ రాకపోవటంతో త్వరలోనే ఈ యుద్ధానికి అంతం వస్తుందనే వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నేడు షాపింగ్ చేసే వ్యక్తులు వారి నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను తప్పక పరిశీలించాలి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7వేల 500 భారీ తగ్గింపును చూస్తోంది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 155, ముంబైలో రూ.9వేల 155, దిల్లీలో రూ.9వేల 170, కలకత్తాలో రూ.9వేల 155, బెంగళూరులో రూ.9వేల 155, కేరళలో రూ.9వేల 155, పూణేలో రూ.9వేల 155, వడోదరలో రూ.9వేల 160, జైపూరులో రూ.9వేల 170, లక్నోలో రూ.9వేల 170, మంగళూరులో రూ.9వేల 155, నాశిక్ లో రూ.9వేల 158, అయోధ్యలో రూ.9వేల 170, బళ్లారిలో రూ.9వేల 155, గురుగ్రాములో రూ.9వేల 170, నోయిడాలో రూ.9వేల 170 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8వేల 200 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 987ముంబైలో రూ.9వేల 987, దిల్లీలో రూ.10వేల 002, కలకత్తాలో రూ.9వేల 987, బెంగళూరులో రూ.9వేల 987, కేరళలో రూ.9వేల 987, పూణేలో రూ.9వేల 987, వడోదరలో రూ.9వేల 992, జైపూరులో రూ.10వేల 002, లక్నోలో రూ.10వేల 002, మంగళూరులో రూ.9వేల 987, నాశిక్ లో రూ.10వేల 071, అయోధ్యలో రూ.10వేల 002, బళ్లారిలో రూ.9వేల 987, గురుగ్రాములో రూ.10వేల 002, నోయిడాలో రూ.10వేల 002గా కొనసాగుతున్నాయి. 
 
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 550 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 870గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 19వేల వద్ద ఉంది.