2016లో బనకచర్లకు పునాది వేసింది కేసీఆరే.. అసెంబ్లీలో చర్చించే దమ్ముందా.. ?: సీఎం రేవంత్

2016లో బనకచర్లకు పునాది వేసింది కేసీఆరే.. అసెంబ్లీలో చర్చించే దమ్ముందా.. ?: సీఎం రేవంత్

మంగళవారం ( జూన్ 24 ) రైతునేస్తం సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2016లో బానకచర్లకు పునాది వేసింది కేసీఆరే అని.. రోజమ్మ రొయ్యల పులుసు తిని నీళ్లు అప్పగించింది ఎవరు అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఎవరు తెలంగాణకు ద్రోహం చేశారో చర్చిద్దామంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్. మా పాలన, మీ పాలనపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కృష్ణానదిపై కేసీఆర్ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అన్నారు.

గోదావరి బనకచర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబుతో ఉండేవాడిని అయితే.. అక్కడే ఉండేవాడినని అన్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనే దమ్ము కేసీఆర్ కు ఉందా అని అన్నారు. నీటి హక్కుల విషయంలో తెలంగాణకు  మరణశాసనం రాసిందే కేసీఆర్ అని మండిపడ్డారు సీఎం రేవంత్.

ALSO READ | కష్టపడితేనే పదవులు.. మరో పదేళ్లు అధికారం మనదే: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఎగ్గొట్టిన రూ. 7 వేల కోట్ల రైతు భరోసా తమ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. 70 లక్షల మంది రైతుల కళ్ళల్లో సంతోషం చూస్తున్నామని.. రైతు భరోసా కోసం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు నిధులు రిలీజ్ చేయడం రికార్డ్ అని అన్నారు సీఎం రేవంత్. 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చామని.. కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చామని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణ చరిత్ర అంతా రైతులదే అని... భూమి చుట్టూనే మన పోరాటాలు, జీవితాలు ముడిపడ్డాయని అన్నారు. రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ దే అని అన్నారు సీఎం రేవంత్.