Tilak Varma: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్: ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీతో అడగొట్టిన తెలుగు కుర్రాడు

Tilak Varma: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్: ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీతో అడగొట్టిన తెలుగు కుర్రాడు

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టెస్టుల్లోనూ తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ లో తనదైన ముద్ర వేసి భారత జట్టులో స్థానం ఖరారు చేసుకున్న ఈ యువ క్రికెటర్.. దేశవాళీ వన్డే ఫార్మాట్ లోనూ దుమ్ములేపాడు. తాజాగా టెస్ట్ ఫార్మాట్ లోనూ సెంచరీతో సత్తా చాటాడు. ఏకంగా ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీతో వావ్ అనిపించాడు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో భాగంగా తిలక్ వర్మ తన హాంప్‌షైర్ తరపున ఆడుతూ తన అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ కొట్టడం విశేషం. 

ALSO READ | ENG vs IND 2025: చేజారుతున్న విజయం: లీడ్స్ టెస్టులో వికెట్ కోసం శ్రమిస్తున్న టీమిండియా

ఎసెక్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజుల ఆటలో భాగంగా 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన 22 ఏళ్ల బ్యాటర్ రెండో రోజు తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేసినా ఈ తెలుగు కుర్రాడు 241 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసిన వెంటనే తిలక్ వర్మ హార్మర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. తిలక్ వర్మ కెరీర్ లో ఇది ఆరో సెంచరీ.  తిలక్ తో  పాటు డాసన్ కూడా సెంచరీ కొట్టడంతో హాంప్‌షైర్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం హాంప్‌షైర్ తమ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసి 90 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

తిలక్ ఇండియా తరపున నాలుగు వన్డేలు, 25 టీ20లు ఆడాడు. ఐపీఎల్ లో ముంబై తరపున ఆకట్టుకున్నాడు. అయితే తన కెరీర్ లో కేవలం 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం అతను హాంప్‌షైర్ తరపున నాలుగు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో ఆడనున్నాడు. మ్యాచ్ కు ముందు తిలక్ మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్ నాకు ఇష్టమైన ఫార్మాట్ అని తిలక్ హాంప్‌షైర్ క్రికెట్ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నేను టీ20ల్లో మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాను. అందరూ నన్ను టీ20 స్పెషలిస్ట్ అనుకుంటారు. కానీ చాలా కాలంగా నేను కూడా మంచి టెస్ట్ బ్యాటర్‌ని అని చెబుతున్నాను". అని తిలక్ చెప్పుకొచ్చాడు.