పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు :  ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత టి.పతంజలి శాస్త్రికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’(షార్ట్ స్టోరీస్) పుస్తకానికి ఈ అవార్డు వరించింది. బుధవారం సాహిత్య అకాడమీ2023 అవార్డులను ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 12న ఢిల్లీలోని కోపర్ నికస్ మార్గ్ లోని కమాని ఆడిటోరియంలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు, తామ్ర పత్రం అందించనున్నారు.