
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని సాధించింది. అందులో పవన్ కల్యాణ జనసేన పార్టీ వందశాతం విజయాన్ని సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. జనసేన పోటీచేసిన 21 ఎమ్మెల్యే స్థానాలకు 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు 2 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. దాంతో ప్రస్తుతం ప్రభుత్వంలో ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఇటీవలే ప్రమాణస్వీకారం కూడా చేశారు.
అయితే.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడం కోసం మెగా ఫ్యామిలీ అంతా ఆయన కోసం ప్రచారం చేశారు. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోలందరూ జనసేన తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమలలో తన మొక్కు తీర్చుకున్నారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే.. కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకున్నారట సాయి ధరమ్. ఆయన కోరిక తీరడంతో తాజాగా మొక్కు తీర్చుకున్నాడట సాయి ధరమ్. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. హనుమాన్ సినిమా మేకర్స్ తో సాయి ధరమ్ ఒక కొత్త సినిమాను చేస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఆ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకనట రాలేదు.