ఎన్టీఆర్ వాయిస్ తో 'విరూపాక్ష' టైటిల్ గ్లింప్స్‌

ఎన్టీఆర్ వాయిస్ తో 'విరూపాక్ష'  టైటిల్ గ్లింప్స్‌

సాయి ధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ నేడు టైటిల్ గ్లింప్స్‌ ని మేకర్స్ విడుదల చేశారు . టైటిల్ గ్లింప్స్‌ కు టాలీవుడ్  స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. “అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన  వాయిస్ ఓవర్ బాగా ఆకట్టుకుంటోంది. 

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి బీవీఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా  అజనీష్ లోకనాథ్   సంగీతం అందిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. సాయిధరమ్ తేజ్ కి ఇది 15వ సినిమా కావడం విశేషం.