సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఎంటర్‌టైన్ చేసిన శర్వానంద్.. ‘భోగి’ అనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా, శనివారం నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు.
ఈ కీలక షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించారు. ఇందులో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు చిత్రీకరించనున్నారు. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యే వరకు శర్వా నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
ఈ అప్‌డేట్‌ను అందించిన టీమ్.. సెట్‌లో శర్వా ఫొటోను రిలీజ్ చేసింది. రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్‌ను పట్టుకుని మాసివ్ లుక్‌లో వెనుక నుంచి కనిపిస్తున్న శర్వా పోస్టర్ ఇంటెన్స్‌గా ఉంది. 1960 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ స్పార్క్ పేరుతో ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
