సాయి దుర్గ తేజ్ హీరోగా నటించబోతున్న 19వ చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా ‘క’ చిత్రం తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న యువ దర్శకులు సుజిత్, సందీప్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. వారి గత చిత్రం లాగే సరికొత్త స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని కాన్సెప్ట్ పోస్టర్‌తో అర్థమవుతోంది.
ఇందులో ఓ యోధుడు విస్తారమైన ఆకాశ గోళాల ముందు నిలబడి ఉండటం, మూవీ స్కేల్, విజువల్ గ్రాండియర్‌ను సూచిస్తోంది. మిథిక్ సై-ఫై జానర్‌లో యుగాల నాటి రహస్యాలు, ఊహకు అందని అద్భుత శక్తుల చుట్టూ తిరిగే కథాంశంతో, గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా దీన్ని రూపొందించబోతున్నట్టు దర్శకనిర్మాతలు తెలియజేశారు.
