పక్కన ఎవరితను..పెళ్లి దండలతో సాయిపల్లవి..ఫొటోలు వైరల్

పక్కన ఎవరితను..పెళ్లి దండలతో సాయిపల్లవి..ఫొటోలు వైరల్

తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో తన కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi). తన సహజమైన నటనతో..డ్యాన్స్ తో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది.

రీసెంట్గా సాయి పల్లవి మ్యారేజ్ అయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి మెడలో పూల దండలు, పక్కనే ఒక వ్యక్తి ఉండటంతో..ఫ్యాన్స్ షాక్ గురవుతున్నారు. కొంత మంది ఇది ఫేక్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. లేటెస్ట్గా ఇదే విషయంపై విరాట పర్వం డైరెక్టర్ వేణు అడుగుల పేస్ బుక్ లో పోస్ట్ పెడుతూ స్పష్టత ఇచ్చారు. తమిళ యాక్టర్ శివ కార్తికేయన్ (SK21) కొత్త మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో..SK21 డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామితో తీసుకున్న ఫోటో అని తెలిపాడు. 

విరాట పర్వం, గార్గి మూవీస్ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి త్వరలో మ్యారేజ్ చేసుకోబోతుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు డైరెక్టర్. ఇక ప్రస్తుతం నాగ చైతన్య(Naga Chaitanya)..చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబోలో, శివ కార్తెకేయన్ తో మరో మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.