బ్యాడ్మింటన్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు స్టార్‌ ప్లేయర్

బ్యాడ్మింటన్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు స్టార్‌ ప్లేయర్

2010లో వరల్డ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించాడు తెలుగు షెట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌. బ్యాడ్మింటన్ గేమ్ లో తనదైన ముద్ర వేసిన మన తెలుగు కుర్రాడు.. తాజాగా కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్లేయర్ గా గుడ్ బై చెప్పినా కోచ్ గా కొనసాగుతానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. త్వరలో అమెరికాలోని ఓ బ్యాడ్మింటన్‌ అకాడమీలో సాయి ప్రణీత్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

24 ఏళ్లుగా తనతో బ్యాడ్మింటన్‌ ఎంతగానో పెనవేసుకుంది. ఇది కఠిన నిర్ణయం అయినా.. తప్పలేదు. త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నా సుదీర్ఘ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన కోచ్‌లు గోపీచంద్‌, ఆరిఫ్‌, గోవర్దన్‌లకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు’ అని ప్రణీత్‌ భావోద్వేగంతో మాట్లాడాడు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత ప్రణీత్‌.. ఆటకు దూరంగా ఉన్నాడు. వరుస గాయాలతో అతను కొన్నాళ్లుగా ఎలాంటి టోర్నీలో కనిపించలేదు. దీంతో ఆటకు వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. 

ALSO READ :- T20 World Cup 2024: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

2010లో వరల్డ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం నెగ్గడంతో పాటు..టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ 31 ఏళ్ల షట్లర్‌ 2017లో సింగపూర్‌ సూపర్‌ ఓపెన్‌ సిరీస్‌ను, 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించి సంచలనం సృష్టించాడు.