ఎన్టీఆర్​ కోసం రంగంలోకి బాలీవుడ్ హీరో?

ఎన్టీఆర్​ కోసం రంగంలోకి బాలీవుడ్ హీరో?

డైరెక్టర్ కొరటాల శివ,​ జూనియర్​ ఎన్టీఆర్​ కాంబోలో ‘ఎన్టీఆర్​30 పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేవారంలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. దీనికి బాలీవుడ్​ యాక్టర్​ సైఫ్​అలీ ఖాన్​ హాజరు కాబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్​30లో ఇప్పటికే బాలీవుడ్ ​నటి జాన్వీ కపూర్​ను హీరోయిన్​గా తీసుకున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. 

అయితే సైఫ్​ అలీ ఖాన్ ​కూడా ఈ సినిమాలో నటింపజేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓం రౌత్​ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఆదిపురుష్​లో రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్​తర్వాత ఎన్టీఆర్​ చేస్తున్న ఈ సినిమా ఇదే. దీనిపై భారీ అంచనాలున్నాయి. దీంతో స్క్రిప్ట్​ వర్క్ ​కోసం కొరటాల ఎక్కువ టైం తీసుకున్నట్లు తెలుస్తోంది.