అవకాశమిస్తే మళ్లీ పోటీ చేస్తా

అవకాశమిస్తే మళ్లీ పోటీ చేస్తా

డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌‌‌, హీరో, హోస్ట్‌‌‌‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ చేస్తున్న సాయికుమార్.. సందీప్ మాధవ్ హీరోగా అప్సర్ రూపొందించిన ‘గంధర్వ’లో కీలక పాత్ర పోషించారు. జులై 8న ఈ మూవీ విడుదలవుతున్న సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు.

‘‘ఈ సినిమాలో నాది సీఎం కావాలనుకునే పొలిటీషియన్ పాత్ర. కానీ స్టోరీ పరంగా  మా నాన్న యంగ్‌‌‌‌గా కనిపిస్తాడు. మా అమ్మ వయసు మీద పడినట్టు కనిపిస్తుంది. దాంతో మీడియా ఫోకస్‌‌‌‌ అంతా వీరిద్దరిపైనే ఉంటుంది. తన ఇమేజ్‌‌‌‌ని దెబ్బతీసేలా వాళ్లిద్దరి మధ్య రిలేషన్‌‌‌‌ని చూపిస్తారు. నా క్యారెక్టర్ చాలా చాలెంజింగ్‌‌‌‌గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా టైమ్ ట్రావెల్ చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌గా అనిపించింది నాకు. ఔట్‌‌‌‌పుట్ చూసినవాళ్లంతా  కాన్సెప్ట్ కొత్తగా ఉంది అంటున్నారు. ఈ పాయింట్‌‌‌‌తో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయగలిగితే సక్సెస్ సాధించినట్టే. ఎమోషన్స్, డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ఇందులో బాబూమోహన్‌‌‌‌ని చూస్తే ‘అంకుశం’ సినిమా గుర్తు వస్తుంది.  ప్రస్తుతం పదిహేను సినిమాలు చేస్తున్నాను. అన్నింట్లోనూ డిఫరెంట్ రోల్స్. కన్నడ మూవీలో రొమాంటిక్ విలన్‌‌‌‌గా కనిపిస్తాను. ధనుష్ ‘సర్’లో హ్యూమర్‌‌‌‌‌‌‌‌తో ఉండే నెగిటివ్ రోల్. నాని ‘దసరా’లో నాది ఎవరూ ఊహించని గెటప్‌‌‌‌. ‘పోలీస్ స్టోరీ 3’ కూడా ప్లాన్ చేస్తున్నాం. నేనిప్పటికే చాలా పాత్రలు చేశాను. కానీ చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయనిపిస్తుంది. ఓటీటీ ద్వారా కూడా మంచి పేరు వచ్చింది. త్వరలోనే కొత్త వెబ్‌‌‌‌ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా క్లాసిక్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆది స్ట్రగులింగ్ స్టేజ్‌‌‌‌లో ఉన్నాడు. కానీ తను బిజీగా ఉండటం హ్యాపీ. ప్రొడ్యూసర్స్ హీరోగా తనకి మంచి పేరొచ్చింది. నాకు పోలీస్‌‌‌‌ స్టోరీ పడినట్టే వాడికి ఒక్క హిట్ పడితే స్టెబిలైజ్ అయిపోతాడు. నాకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు.  2004 నుంచి పాలిటిక్స్‌‌‌‌లో ఉన్నాను. సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాలని వెంకయ్యనాయుడు అప్పట్లో సూచించారు. కర్ణాటకలో బీజేపీ తరఫున పోటీ చేశా.. ఇండియా మొత్తం క్యాంపెయినింగ్ చేశా. అవకాశమిస్తే ఇప్పుడొచ్చే ఎలక్షన్స్‌‌‌‌లో కూడా మళ్లీ పోటీ చేస్తా. నామినేటెడ్‌‌‌‌ పోస్ట్ అయినా వస్తుందనుకుంటున్నా.’’