హిట్ దర్శకుడితో.. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నిర్మల కాన్వెంట్ హీరో

హిట్ దర్శకుడితో.. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నిర్మల కాన్వెంట్ హీరో

‘నిర్మల కాన్వెంట్’ చిత్రంతో  హీరోగా పరిచయమై మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘పెళ్లి సందD’ సినిమాతో  తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రోషన్ మేక.  శ్రీకాంత్ కొడుకుగానే కాకుండా హీరోగా  తనకంటూ ఓ ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ‘చాంపియన్’ చిత్రంలో నటిస్తున్న రోషన్  నెక్స్ట్ మూవీ  కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.  ‘హిట్’ ఫ్రాంచైజీలతో దర్శకుడిగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ నటించనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందని  రూమర్స్ వచ్చినా తాజాగా అది అఫీషియల్‌‌గా కన్ఫర్మ్ అయ్యింది.  రోషన్‌‌తో ఓ లవ్ స్టోరీ తెరకెక్కించేందుకు శైలేష్ ప్లాన్ చేస్తున్నాడట.  ఈ చిత్రాన్ని  సితార ఎంటర్‌‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.