
చి.ల.సౌ, హిట్ లాంటి చిత్రాలతో హీరోయిన్‌గా గుర్తింపును అందుకుంది రుహాని శర్మ. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైంధవ్’ చిత్రంలో నటిస్తోంది. శుక్రవారం ఈ విషయాన్ని రివీల్ చేసిన టీమ్, తన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో డాక్టర్ రేణు అనే పాత్రలో రుహానీ నటిస్తోంది. పోస్టర్‌లో సీరియస్ లుక్‌లో కనిపించిందామె. దర్శకుడు శైలేష్ ఫస్ట్ మూవీ ‘హిట్’లో హీరోయిన్‌గా నటించిన రుహానీ.. ఇందులో ఓ కీలకపాత్రను పోషిస్తోంది. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ జరుగుతోంది. వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రమిది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న విడుదల కానుంది.