యదార్థ సంఘటన ఆధారంగా సాయిరాం శంకర్ కొత్త సినిమా

యదార్థ సంఘటన ఆధారంగా సాయిరాం శంకర్ కొత్త సినిమా

సాయిరాం శంకర్ హీరోగా  ప్రకాష్ జూరెడ్డి దర్శకత్వంలో రమణి జూరెడ్డి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోలవరం బంగారమ్మ అమ్మవారి గుడిలో  మంగళవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ‘గంగ తలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గాని జారిందా శివమెత్తుతాడు’ అని ముహూర్తపు సన్నివేశంలో సాయిరాం శంకర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. 

90లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విలేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తామన్నారు.