
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ....
జనసేన పార్టీ విధానం చూస్తేనే వెనుక చంద్రబాబు ఉన్నాడని తెలిసిపోతోందని సజ్జల అన్నారు. చంద్రబాబు ఏం చెబితే జనసేనాని అది చేస్తారన్నారు. వారు విడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా ఇద్దరూ ఒకటే అన్నారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలా? విడిగా పోటీ చేయాలా? అనే దానిని తేల్చేది పవన్ కాదని, చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో ఘోరాలు జరిగాయని దుయ్యబట్టారు. టార్చ్ లైట్ టెక్నాలజీని కనిపెట్టింది కూడా తానే అంటాడని, అలాంటి చంద్రబాబును చూసి అందరూ నవ్వుకుంటున్నారన్నారు.
వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమని పవన్ ఏడాది నుంచి చెబుతున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష ఓటు చీలకూడదని పవన్ చెబుతున్నారన్నారు. 2019లో చంద్రబాబు పవన్‌ను విడిగా పోటీ చేయమన్నారు. ఇప్పడు కలిసి చేయాలి అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు కలుస్తున్నారు. చంద్రబాబునాయుడుతో బేరం కుదుర్చుకోవడానికి పవన్ ఓసారి అటు ఇంకో సారి ఇటు మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు
చంద్రబాబు విజన్ డాక్యుమెంట్‌పై ..
2014-19 మధ్య చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు సజ్జల. చంద్రబాబు మాట్లాడే మాటలు ఒక విజనరీ అయిన వ్యక్తి మాట్లాడిన మాటల్లా లేవని... వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తి మాటలులా ఉన్నాయా ప్రజలకు అర్దమవుతుందన్నారు. టీడీపీ అధినేతను పగటి వేషగాడు అనాలా పిట్టలదొర అని అనాలా ప్రజలే చెప్పాలన్నారు. చంద్రబాబు తనను తాను తిట్టుకోవాల్సిన తిట్లు జగన్‌ను తిడుతున్నారంటూ... ఆయన లాగా 50 ఏళ్ల ప్లాన్లు జగన్ వేయడంలేదు. ఈ ఏడాది ప్రణాళిక వేస్తే వచ్చే ఏడాదే అమలు చేస్తున్నారని సజ్జల అన్నారు.