అమరావతి రాజధాని భూ కుంభకోణం.. సమీక్ష చేయడం ప్రభుత్వాల బాధ్యత

అమరావతి రాజధాని భూ కుంభకోణం.. సమీక్ష చేయడం ప్రభుత్వాల బాధ్యత

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆయనప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో తీసుకున్ననిర్ణయాలపై విచారణను కొనసాగించడంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు మళ్లీ పట్టాలెక్కబోతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం కావొచ్చు..ఇంకెవరి ప్రభుత్వమైనా కావొచ్చు..రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే అది ముమ్మాటికి తప్పే అవుతుందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో జరిగిన తప్పులపై  సమీక్ష చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. 

సమీక్ష చేయడం..  ప్రభుత్వాల బాధ్యత

గత ప్రభుత్వం తీసుకున్నవిధానపరమైన తప్పుడునిర్ణయాలు,రాష్ట్రానికి కీడు కలిగించే చర్యలను..ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం సమీక్షించడం అనేది- ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల బాధ్యత అని సజ్జల వ్యాఖ్యానించారు.అలా చేయకపోతే ప్రస్తుత ప్రభుత్వం కూడా తప్పు చేసినట్లే అవుతుందన్నారు.  తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరగలేదని భావిస్తే భయపడాల్సిన అవసరం  టీడీపీ వారికి లేదని సజ్జల అన్నారు.

దేశంలోనే ఇది పెద్ద భూ కుంభకోణం

దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం రాజధాని అమరావతి పరిధిలో చోటు చేసుకుందని..దీన్ని బయటపెట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు దోహదపడతాయని అన్నారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదని, గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశాడని సజ్జల చెప్పారు. భూసేకరణ కూడా పూర్తి చేయలేదని, రైతులకు ఎలాంటి పరిహారాన్ని అప్పట్లో ప్రకటించలేదని చెప్పారు. పిలిచిన టెండర్లను ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.