పుకార్లు నమ్మొద్దు.. పోరాటం కొనసాగిస్తున్నాం : రెజ్లర్లు

పుకార్లు నమ్మొద్దు.. పోరాటం కొనసాగిస్తున్నాం : రెజ్లర్లు

న్యూఢిల్లీ: న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఇండియా స్టార్ రెజ్లర్లు బజ్‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌ పునియా, వినేశ్‌‌‌‌‌‌‌‌ ఫొగాట్‌‌‌‌‌‌‌‌, సాక్షి మాలిక్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ఆపేసి, బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌పై కేసును వెనక్కితీసుకున్నారన్న తప్పుడు వార్తలతో కొందరు  తమ  ఉద్యమాన్ని తీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోరాటం ఆపినట్టు వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని తేల్చి చెప్పారు. ముగ్గురు రెజ్లర్లు శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షాను కలిశారు. రైల్వే ఉద్యోగులైన బజ్‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌, వినేశ్‌‌‌‌‌‌‌‌, సాక్షి సోమవారం తమ బాధ్యతల్లో చేరారు.

దాంతో, వాళ్లు వెనక్కితగ్గారన్న వార్తలు వచ్చాయి. కానీ, వాటిని ముగ్గురూ కొట్టి పారేశారు.  ‘అమిత్‌‌‌‌‌‌‌‌ షాతో సాధారణ చర్చలే జరిగాయి. ఎలాంటి పరిష్కారం లభించలేదు. నిందితులను అరెస్టు చేయాలన్న మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ పోరాటంలో మేమంతా కలిసే ఉన్నాం. మాకు న్యాయం జరిగేంత వరకూ ఐక్యంగానే ఉంటాం’ అని సాక్షి చెప్పింది.  

న్యాయం కోసం ఓవైపు సత్యాగ్రహంతో పాటు రైల్వే ఉద్యోగిగా తన బాధ్యతలు నిర్వర్తించేందుకే డ్యూటీలో చేరానని తెలిపింది. ‘మేం ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదు, విరమించలేదు. మహిళా రెజ్లర్లు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి తీసుకున్నారనే వార్తలు కూడా అవాస్తవం. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని బజ్‌‌‌‌‌‌‌‌ రంగ్‌‌‌‌‌‌‌‌  తేల్చి చెప్పాడు.

మరిన్ని వార్తలు