Mowgli 2025: మోగ్లీ క్రేజీ అప్డేట్.. మోడల్తో యాంకర్ సుమ కుమారుడు

Mowgli 2025: మోగ్లీ క్రేజీ అప్డేట్.. మోడల్తో యాంకర్ సుమ కుమారుడు

మరాఠీ భాషకు చెందిన మోడల్ సాక్షి మదోల్కర్ ‘మోగ్లీ 2025’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రోషన్ కనకాల హీరోగా ‘కలర్‌‌‌‌ ఫొటో’ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

శనివారం (AUG9) సాక్షి పుట్టినరోజు సందర్భంగా ‘మా రామ చిలుక’ అంటూ  ఈ చిత్రంలోని తన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఇందులో ఆమె జాస్మిన్ పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు.

ఫారెస్ట్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో లవ్‌‌స్టోరీగా రూపొందిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌‌తో రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.