సలార్ సినిమాకు పిల్లలను తీసుకు రావొద్దు.. ధియేటర్లు ఫోన్లు

సలార్ సినిమాకు పిల్లలను తీసుకు రావొద్దు.. ధియేటర్లు ఫోన్లు

సలార్ మూవీ చూసే విషయంలో ఫ్యామిలీస్ ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభాస్ మూవీ కదా అని కుటుంబాలకు కుటుంబాలు టికెట్లు బుక్ చేసుకుంటున్నాయి. తెలుగు సినిమా.. అందులోనూ ప్రబాస్ మూవీ కదా అని.. మల్టీఫ్లెక్సులకు వెళుతున్నారు. ఇలా వెళుతున్న ఫ్యామిలీలకు ఇబ్బందులు తప్పలేదు.. పిల్లలను ధియేటర్లలోకి అనుమతించటం లేదు.. 18 సంవత్సరాలకు ఒక్క రోజు తక్కువ వయస్సు ఉన్నా.. నో ఎంట్రీ అంటున్నారు. దీంతో మల్టీఫ్లెక్సుల దగ్గర గందరగోళం, గొడవలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా అండీ.. మా ఇష్టం చూస్తాం.. మీకేంటీ అభ్యంతరం అంటూ వాగ్వాదాలకు దిగుతున్నారు. ధియేటర్ కు వెళుతున్న ఫ్యామిలీలు.. పిల్లలకు వదిలేసి లోపలికి వెళ్లలేక.. వెనక్కి తిరిగి వస్తున్నారు. ఆదివారం రోజు మాత్రమే కాదు.. సోమవారం సైతం ఇలాంటి సిట్యువేషన్ చాలా ధియేటర్ల దగ్గర జరుగుతుంది. క్రిస్మస్ హాలిడేస్ వరసగా నాలుగు రోజులు రావటంతో.. వేలాది కుటుంబాలు.. సలార్ మూవీ టికెట్లు బుక్ చేసుకుని.. తీరా థియేటర్ల దగ్గరకు వెళ్లి నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నాయి.

ఈ పరిస్థితిని గమనించిన మల్టీప్లెక్స్ బుకింగ్ సెంటర్లు.. టికెట్ బుక్ చేసుకున్న వారికి ఫోన్లు చేస్తున్నారు.. మీరు పిల్లలతో వస్తే అనుమతించేది లేదని.. ఫోన్లలోనూ ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో టికెట్ బుక్ అయ్యి.. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. సలార్ కలెక్షన్లు భారీగా తగ్గటానికి ఇదో కారణం. ఇప్పటికీ చాలా మంది ఈ సినిమా చూద్దామనుకున్నా.. చూడలేకపోయారు. 

కొన్ని మల్లీప్లెక్స్ ధియేటర్లలో టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తుండగా.. మరికొన్ని ధియేటర్లలో ఎలాంటి రిఫండ్ రావటం లేదు. దీంతో వేలకు వేల రూపాయలు పెట్టి సినిమా టికెట్లు కొనుగోలు చేసిన మధ్య తరగతి ప్రజలు నష్టపోతున్నారు. గతంలో చాలా సినిమాలకు ఏ సర్టిఫికెట్ ఉన్నా.. ధియేటర్లలో పెద్దగా ఆంక్షలు ఏమీ లేవు.. సలార్ విషయంలో కఠినంగా వ్యవహరించటంతో గందరగోళం నెలకొంది. కొంత మంది సినిమా అభిమానులు అయితే.. సలార్ కంటే ఘోరమైన బూతులు, అర్ధనగ్న శృంగారం.. ఉన్న సినిమాలకు సైతం యూ సర్టిఫికెట్ ఇచ్చారని.. అలాంటి సినిమాలకు పిల్లలను అనుమతించారని.. సలార్ విషయంలో మరీ కఠినంగా ఉండటం ఏంటీనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.