సలార్ టికెట్ ధర 450 రూపాయలా.. షాక్ అవుతున్న ఫ్యామిలీస్..

సలార్ టికెట్ ధర 450 రూపాయలా.. షాక్ అవుతున్న ఫ్యామిలీస్..

సలార్.. సలార్.. సలార్.. ప్రభాస్ మూవీ మానియా నడుస్తుంది.. ఆదిపురుష్ తర్వాత వచ్చింది.. పెద్దగా పబ్లిసిటీ ఇవ్వలేదు.. ఈవెంట్స్ పెట్టలేదు.. హైప్ క్రియేట్ చేయలేదు.. అత్యంత భారీ అంచనాలు పెంచకుండానే ధియేటర్లలోకి వచ్చిన మూవీ సలార్.. మంచి టాక్ అయితే వస్తుంది.. ఇదే సమయంలో సలార్ టికెట్ల ధరలు చూసి కళ్లు తేలేస్తున్నారు సినీ అభిమానులు.. మల్టీఫ్లెక్స్ ధియేటర్లలో కనీస టికెట్ ధర 450 రూపాయలుగా ఉంది.. సింగిల్ ధియేటర్ల 175 నుంచి 250 రూపాయల వరకు టికెట్ ధరలు నిర్ణయించారు..

మల్టీఫ్లెక్సుల్లో అయితే ట్రిబుల్ అయ్యింది ధర.. మామూలు రోజుల్లో 150 రూపాయల టికెట్ సలార్ సినిమాకు 450 రూపాయలు చేశారు. ఫస్ట్ డే.. ఫస్ట్ రోజు.. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఓకే.. మిగతా వాళ్లు అయితే అమ్మో అంటున్నారు. ఇంట్లో నలుగురు ఫ్యామిలీ వెళ్లాలంటే 2 వేల రూపాయలు టికెట్లకే అవుతుంది.. ఇక ఇంటర్వెల్ లో మరో వెయ్యి రూపాయలు కనీసం అవుతుంది.. అంటే సలార్ మూవీని.. మల్టీ ఫ్లెక్సుల్లో ఓ ఫ్యామిలీ చూడాలంటే 3 వేల రూపాయలు ఖర్చు అవుతుందా.. సలార్ టికెట్ల రేట్లు చూసినోళ్లు నోరెళ్లబెడుతున్నారు.. ఏదో వెయ్యి 15 వందలు అనుకుంటే పర్వాలేదు.. మూడు గంటల సినిమాకు.. మూడు వేల రూపాయలా అని అవాక్కవుతున్నారు..

డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతైనా పెడతారు.. మధ్య తరగతి ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ అంటే సినిమా ఫస్ట్ ప్రయార్టీ.. అందులోనూ ప్రభాస్ అంటే లేడీస్ ఫ్యాన్స్.. యూత్ ఫ్యాన్స్.. వీళ్లందరూ మధ్య తరగతి కుటుంబాల్లోనే ఉంటారు కదా.. మరీ టూమచ్ రేట్లు అంటున్నారు మధ్యతరగతి ప్రజలు.. టికెట్ 450 రూపాయలు ఏంటీ అని ప్రశ్నిస్తూనే.. 200 రూపాయలు తగ్గించాలని కోరుకుంటున్నారు..