Salaar Team Special Interview: రాజమౌళి అదిరిపోయే క్వశ్చన్స్..ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్

Salaar Team Special Interview: రాజమౌళి అదిరిపోయే క్వశ్చన్స్..ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్

సలార్ టీమ్తో దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) చేసిన ఫుల్ ఇంటర్వ్యూ అదిరిపోయే వ్యూస్ తో ఉరకలేస్తోంది. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్, పృధ్వి రాజ్ సుకుమారన్ తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూలో అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలు..సమాధానాలు ఏంటో చూద్దాం. ఎందుకంటే ప్రభాస్ అలా నిల్చుంటే చాలు..అతనికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఫ్యాన్స్..మేకర్స్ ఇండస్ట్రీలో చాలానే ఉన్నారని గుర్తు చేస్తూ షురూ చేసిన ఇంటర్వ్యూ భలే ఆకట్టుకుంటోంది. 

రాజమౌళి: 

సలార్ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎందుకు రావాలి?

ప్రశాంత్ నీల్: 

ఎమోషన్ని పంచే సలార్ స్నేహం చూడటానికి రావాలి. ఇందులో దేవ, వరద రాజ మన్నార్ల ప్రాణ స్నేహం..ఒక్కసారిగా ఎలా విరోధులుగా మారారు అన్నది తెలుసుకోవడానికి సలార్ కథని తప్పక చూడాలి. 

రాజమౌళి: 

ఈ సినిమాలో ఎక్కువగా కనెక్ట్ అయ్యే అంశం?

ప్రశాంత్ నీల్: 

ఇందులో చూపించిన ప్రధాన పాత్రల మధ్య వచ్చే డ్రామా..కంటతడి పెట్టించే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. 

రాజమౌళి: 

సలార్ సినిమా కె.జి.ఎఫ్ సిరీస్ కు సంబంధం ఉంటుందా?

ప్రశాంత్ నీల్: 

నీల్ యూనివర్స్లా సినిమాలు చేయడం తన వల్ల కాదని..కె.జి.ఎఫ్ లో చూపించిన రాకీ భాయ్ని ఎలా ఇష్టపడ్డారో..సలార్లో దేవా, వరదరాజ లను అదే విధంగా ఇష్టపడతారు. అంతకు మించిన డ్రామా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటారు.

రాజమౌళి: 

సాధారణంగా ప్రభాస్ మూవీ అంటే కిడ్స్ ఇష్టపడతారు. కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది..వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి?

ప్రశాంత్ నీల్ :

సలార్ లో యాక్షన్ సీన్స్ ఎక్కడ కావాలని పెట్టినవి కాదు.ఖాన్సర్లో జరిగే యుద్ధంలో భాగంగా పెట్టినవే. ఇందుకు సెన్సార్ టీం అభ్యంతరాలు చెప్పింది అయితే దాన్ని ట్రిమ్ చేస్తే సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని ఉంచమని చెప్పాము. అందుకే సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని..ప్రభాస్ కూడా దానికి మనం ఏం చేయలేమని అన్నారు.

రాజమౌళి:

శృతిహాసన్..ప్రభాస్తో కాంబోలో సలార్లో ఎలాంటి డ్యూయెట్ లేదని తెలుస్తోంది? నేను అప్సెట్ అయ్యాను..  

ప్రశాంత్ నీల్: 

ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఖాన్సర్ కథలో భాగమని అన్నారు. వరల్డ్ సినిమా తన పంథా పూర్తీగా మార్చుకుంది అందుకే ఈ సినిమాలో డ్యూయెట్ లేదని అన్నారు.

రాజమౌళి:

సలార్ సినిమా విషయంలో కొన్నాళ్లుగా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలానే కామెంట్ చేశారు. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు?

ప్రశాంత్ నీల్: 

అందుకే చాలా కాలం నుంచి సోషల్ మీడియాకు..గుడ్ బై చెప్పానని..ఎందుకంటే ఏదైనా అంశంలో 1000 మంది మెచ్చుకుని....ఏ ఒక్కరు విమర్శించినా అది నన్ను చాలా హర్ట్ చేస్తుంది. అందుకే సినిమా ఎండ్ అయ్యే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని అన్నారు ప్రశాంత్ నీల్.

ఇంతేకాకుండా ఇంకా అదిరిపోయే ప్రశ్నలు..సమాధానాలతో ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి.