చాలా కంపెనీల్లో జీతాలు పెరిగాయ్​

V6 Velugu Posted on Sep 21, 2021

  • 2022లో జీతాలు  8.6 శాతం పెరగొచ్చు
  • ఐటీ, లైఫ్‌‌ సైన్సెస్‌‌ ఎంప్లాయిస్‌‌కు భారీ జీతాలు
  • వెల్లడించిన డెలాయిట్‌‌ సర్వే 

న్యూఢిల్లీ: తమ ఎంప్లాయిస్‌‌కు  ఈ ఏడాది సగటున 8 శాతం జీతం పెంచామని ప్రైవేటు కంపెనీలు తెలిపాయి. అయితే వచ్చే ఏడాది సగటు పెంపు 8.6 శాతం వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. అయితే ఐటీ, లైఫ్‌‌సైన్సెస్‌‌, ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌, డిజిటల్‌‌ కంపెనీలు భారీ జీతాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ ఏడాది 92 శాతం కంపెనీలు ఎనిమిదిశాతం ఇంక్రిమెంట్లు ఇచ్చాయని డెలాయిట్‌‌ వర్క్‌‌ఫోర్స్‌‌ అండ్ ఇంక్రిమెంట్‌‌ ట్రెండ్స్ సర్వే పేర్కొంది. ఇందులోని వివరాల ప్రకారం.. తాము వచ్చే ఏడాది రెండంకెల ఇంక్రిమెంట్‌‌ ఇస్తామని 25 శాతం కంపెనీలు ప్రకటించాయి. అయితే అందరికీ భారీగా ఇంక్రిమెంట్లు ఉండవు. స్కిల్స్‌‌, పెర్ఫార్మెన్స్‌‌ బట్టి పెంపు ఉంటుంది. జీతాలు తక్కువగా పెరిగిన వాళ్లు వేరే ఉద్యోగాలు చూసుకుంటారని కంపెనీలు అంచనాలు వేస్తున్నాయి. అయితే రిటైల్‌‌, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, ఇన్ఫ్రా, రియల్టీ కంపెనీల్లో జీతాలు తక్కువగా పెరుగుతాయి. కరోనా వల్ల ఈ సెక్టార్లు చాలా నష్టపోయాయి. నష్టాల్లో ఉన్న కంపెనీల్లోనూ కొన్ని ఈసారి ఇంక్రిమెంట్లు ప్రకటించాయని డెలాయిట్‌‌ పార్ట్‌‌నర్‌‌ అనుభవ్‌‌ గుప్తా వివరించారు. గత ఏడాది 10 శాతం మంది ఎంప్లాయిస్‌‌కు ప్రమోషన్లు రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం మందికి ప్రమోషన్లు వచ్చాయి. దాదాపు 12 శాతం కంపెనీలు బోనస్‌‌లను ప్రకటించాయి. 
ఇంపార్టెంట్ పాయింట్స్‌‌:
1.కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 60 శాతం కంపెనీలు తమ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీలను అప్‌‌డేట్‌‌ చేశాయి. లైఫ్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీల్లోనూ మార్పులు చేశామని 24 శాతం కంపెనీలు వెల్లడించాయి. 
2.ప్రతి మూడు కంపెనీల్లో రెండు లీవ్స్‌‌ పాలసీలను కూడా మార్చేశాయి. స్పెషల్‌‌ లీవ్స్‌‌ సంఖ్యను 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచాయి. ఇవి యాన్యువల్ పెయిడ్‌‌ లీవ్స్‌‌కు అదనం
3.కరోనా వల్ల మరణించిన ఉద్యోగులకు ఆర్థికంగా కొంతసాయం చేశామని సర్వేలో పాల్గొన్న వాటిలో 50 శాతం కంపెనీలు ప్రకటించాయి.  కొత్త ఉద్యోగులను తీసుకోవడం మొదలుపెట్టామని 78 శాతం కంపెనీలు ప్రకటించాయి. 
4.వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌ను  కొనసాగిస్తామని ఒకశాతం కంపెనీలే చెప్పాయి. ఈ విధానం తీసేస్తామని 88 శాతం కంపెనీలు ప్రకటించాయి.

చాలా కంపెనీలు ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది ఎక్కువ ఇంక్రిమెంట్లు ఇస్తామని మా సర్వేలో చెప్పాయి. అయితే కరోనా ఎఫెక్ట్‌‌ ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి కచ్చితమైన లెక్కలు వేయడం సాధ్యం కాదు. సెకండ్‌‌వేవ్‌‌ తరువాత జీడీపీ అంచనాలను మార్చారు. ఇంక్రిమెంట్లు ఇచ్చేముందు కంపెనీలు ఇలాంటి వాటిని కూడా చూస్తాయి. ఫిక్స్‌‌డ్‌‌ కాస్టులు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నాయి.                                                                                                                             -ఆనందోరూప్‌‌ ఘోష్‌‌, పార్ట్‌‌నర్‌‌, డెలాయిట్‌‌ టచ్‌‌ తోమత్సు

జాబ్స్‌‌ పెరుగుతున్నయ్‌‌
ముంబై: జాబ్‌‌ రిక్రూట్‌‌మెంట్లు ఈ ఏడాది జూన్‌‌తో పోలిస్తే ఆగస్టులో ఒకశాతం పెరిగాయి. ఇంజనీరింగ్‌‌, లాజిస్టిక్స్‌‌, అగ్రి ఇండస్ట్రీస్‌‌ సెక్టార్ల కంపెనీల్లో ఇంటర్వ్యూలు ఎక్కువగా జరుగుతున్నాయని మాన్‌‌స్టర్‌‌ డాట్‌‌ కామ్‌‌ రిపోర్టు తెలిపింది. తమ పోర్టల్‌‌లో జాబ్‌‌ పోస్టింగులు సీక్వెన్షియల్‌‌గా ఒకశాతం పెరిగాయని తెలిపింది. అయితే, 2020 ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో జాబ్‌‌ పోస్టింగులు 14 శాతం పెరిగాయి. కరోనా ఎఫెక్ట్‌‌ ఇంకా పోకున్నా, జాబ్‌‌ డిమాండ్‌‌ సీక్వెన్షియల్‌‌గా గత ఆరు నెలల్లో ఐదుశాతం పెరిగింది. గార్మెంట్స్‌‌, జెమ్స్‌‌, జ్యూయలరీ ఇండస్ట్రీలు 24 శాతం, ప్రొడక్షన్‌‌, మానుఫ్యాక్చరింగ్‌‌ కంపెనీలు ఎనిమిది శాతం, చమురు/గ్యాస్/పెట్రోలియం/పవర్ కంపెనీలు 6 శాతం, షిప్పింగ్/మెరైన్  సెక్టార్లు 4 శాతం, బీపీఓ/ఐటీఈఎస్‌‌ కంపెనీలు 3 శాతం జాబ్స్‌‌ ఇచ్చాయి.

Tagged business, Salaries, companies, gone up,

Latest Videos

Subscribe Now

More News