
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్
హైదరాబాద్, వెలుగు: కరోనా సోకి డ్యూటీకి రాని కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతంలో కోత విధిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి ఫుల్ శాలరీ ఇవ్వడం కుదరదని మంగళవారం స్పష్టం చేశారు. ఏ శాఖలోనూ ఫుల్సాలరీస్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఫుల్ సాలరీ ఇవ్వాలి
కరోనా వచ్చి క్వారంటైన్ ఉండి, హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఫుల్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సర్కారుకు, విద్యాశాఖ మంత్రికి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు వినతి పత్రాలు ఇచ్చామని, అప్పుడు సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.రమణా రెడ్డి, కొప్పిశెట్టి సురేశ్ గుర్తు చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు పూర్తి వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
For More News..