
- కస్టమర్ సపోర్ట్ టీమ్‌లో
- 5 వేలకు తగ్గిన ఉద్యోగులు
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ సేల్స్‌ఫోర్స్ 4 వేల మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొలగించింది. ఏఐ ఏజెంట్లు 50శాతం కస్టమర్ చాట్స్‌ను నిర్వహిస్తుండడంతో తాజాగా ఉద్యోగులను తగ్గించుకున్నామని కంపెనీ సీఈఓ మార్క్ బెనియాఫ్ పేర్కొన్నారు. దీంతో కంపెనీ కస్టమర్ సపోర్ట్ టీమ్ 9 వేల నుంచి 5 వేలకి తగ్గింది. సేల్స్‌ఫోర్స్ ఈ డిపార్ట్‌మెంట్‌లో 45 శాతం మంది ఉద్యోగులను తీసేసింది.
‘‘ఏఐ ఇప్పుడు 10 కోట్ల పెండింగ్ సేల్స్ లీడ్స్‌ను ఫాలోఅప్ చేస్తోంది. గతంలో ఇది సాధ్యపడలేదు. ఏఐ–హ్యూమన్ .. రెండు కలిసి పనిచేసేందుకు “ఓమ్నిఛానల్ సూపర్‌వైజర్”వ్యవస్థను ఉపయోగిస్తున్నాం’’ అని మార్క్ అన్నారు. ఏఐ ప్రభావం వలన ఉద్యోగాల్లో కోత పెట్టడం లేదని ఈ ఏడాది జులైలో ఆయన పేర్కొన్నారు. కానీ, గ్లోబల్‌గా ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని కంపెనీ తొలగించిందని అంచనా. ఏఐ విస్తరిస్తుండడంతో కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సపోర్ట్ ఏజెంట్లు, లాయర్లను నియమించుకోమని సేల్స్‌ఫోర్స్ ప్రకటించింది.