
బాలీవుడ్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ప్రతి సంవత్సరం తమ ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా గణపతి పూజ నిర్వహించారు. మంగళవారం నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేసారు. వారిలో సల్మాన్ ఖాన్, డైసీ షా, స్వర భాస్కర్ డాన్స్ చేసారు. సల్మాన్ వేసిన డాన్స్ అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.