డాక్టర్లపై దాడిని ఖండించిన సల్మాన్ ఖాన్

డాక్టర్లపై దాడిని ఖండించిన సల్మాన్ ఖాన్

కరోనా వైరస్ ( కోవిడ్ – 19 ) కట్టడికి కృషిచేస్తున్న డాక్టర్లపై జరిగిన దాడిని ఖండించారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. లాక్ డౌన్ ను ఉల్లంగిస్తున్న వారిపైకూడా విరుచుకుపడ్డారు. ఇందుకు గాను ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆయన కుటుంబంతో కలిసి పన్వెల్ ఫామ్ హౌస్‌లో ఉంటున్నారు. ప్రభుత్వం జారీచేసిన లాక్ డౌన్‌ను అందరూ పాటించాలని కోరారు. బయట తిరగడం వలన కరోనా వైరస్ సోకే ప్రమాదముందని చెప్పారు. మరికొందరు కరోనా టెస్ట్‌లు చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లడంలేదని అలాంటి వాళ్లు సమాజానికే కాకుండా వాళ్ల కుటుంబాలకు కూడా ప్రమాదమని, వాళ్లు వ్యాధి వ్వాపించడంలో సహకరిస్తున్నారని తెలిపారు

ఉత్తర ప్రదేశ్ లోని మోరదాబాద్ లో డాక్టర్లపై జరిగిన దాడి తర్వాత సల్మాన్ ఖాన్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కరోనా టెస్ట్‌లు చేయడానికి వచ్చిన డాక్టర్లపై దాడి చేయడం సరికాదన్నారు. మీకోసం డాక్టర్లు, నర్సులు, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే వారిపైనే రాళ్ల దాడులు చేస్తారా అని అన్నారు. ఎవరికైతే కరోనా సోకిందో వాళ్లు హాస్పిటల్ నుంచి తప్పించుకోవాలనుకోవడం పిచ్చి చర్య అని తెలిపారు. ఒక వైపు పేద ప్రజలు ఆహారం కోసం తల్లడిల్లుతుంటే.. మరో వైపు ఇలాంటి జోకర్లు డాక్టర్లను, పోలీసులను ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. పోలీసులకు, డాక్టర్లకు సహకరించాలని కోరారు. కొందరు బాధ్యతలేకుండా ప్రవర్తిస్తే ప్రభుత్వం మరిన్ని కఠినచర్యలు తీసుకోవడానికి కూడా వెనకకు పోదని తెలిపారు. చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ భారత్‌ను బాధిస్తుందని అన్నారు.