రాధే సినిమాను పైరసీ చేసిన వారిని వదిలిపెట్టను

V6 Velugu Posted on May 16, 2021

ముంబై: బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే రీసెంట్‌గా రిలీజైంది. జీ5, జీ ప్లెక్స్ ఓటీటీతోపాటు డిష్ టీవీ, టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ వేదికగా డీటీహెచ్‌లోనూ విడుదలైంది. అయితే అప్పుడే ఈ సినిమా పలు వెబ్ సైట్లలో లీకైంది. రాధే మూవీ పైరసీకి గురవ్వడంపై సల్లూ భాయ్ సీరియస్ అయ్యాడు. మూవీని పైరసీ చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించాడు. తమ చిత్రాన్ని పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాను కేవలం రూ.249కే పే పర్ వ్యూ పద్ధతిలో వీక్షించేందుకు ముందుకు తెచ్చామని చెప్పాడు. రాధేను చట్ట విరుద్ధంగా చూస్తే నేరం చేసినట్లేనన్నాడు.

 

 

Tagged Actor salman khan, leaked, Piracy, web sites, Radhe Movie, Cyber Cell, Zee 5, Zee Plex

Latest Videos

Subscribe Now

More News