GalwanValley: తెలంగాణ జవాన్ బయోపిక్లో సల్మాన్ ఖాన్.. టైటిల్‌‌‌‌ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

GalwanValley: తెలంగాణ జవాన్  బయోపిక్లో సల్మాన్ ఖాన్.. టైటిల్‌‌‌‌ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సల్మాన్ ఖాన్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.  శనివారం ఈ మూవీ టైటిల్‌‌‌‌ను రివీల్ చేస్తూ,  ఫస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్‌‌‌‌ చేశారు. ముఖంపై రక్తం, ముళ్ల ఫెన్సింగ్‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌తో చుట్టిన కర్రను భుజాన వేసుకుని ఫియర్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌గా చూస్తున్న ఆర్మీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌లో సల్మాన్‌‌‌‌ కనిపించాడు.

2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పోరులో 20 మంది భార‌‌‌‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  16వ బెటాలియన్‌‌‌‌ కమాండింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ బి. సంతోష్ బాబు తీవ్రంగా గాయపడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత దళాలను నడిపించారు.

ఆయన మరణానంతరం ప్రభుత్వం మహావీర్ చక్రను ప్రదానం చేసింది. ఇప్పుడు సంతోష్ బాబు పాత్రను ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పోషిస్తున్నట్టు సమాచారం. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌‌‌‌లెస్ 3’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నాడు.