IPL 2026: సాల్ట్ లేడు.. బెథేల్ లేడు.. కీలక మ్యాచులో ఆర్సీబీలో బిగ్ ఛేంజేస్..!

IPL 2026: సాల్ట్ లేడు.. బెథేల్ లేడు.. కీలక మ్యాచులో ఆర్సీబీలో బిగ్ ఛేంజేస్..!

ఐపీఎల్ 19 నాకౌట్ సమరం స్టార్ట్ అయ్యింది. క్వాలిఫయర్ 1లో భాగంగా మంగళవారం (మే 26) ఆర్సీబీ, గుజరాత్ జట్లు తలపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‎లోని ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఈ కీలక మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

అయితే, ఈ కీలకమైన మ్యాచులో ఆర్సీబీ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‎ను జట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం. సాల్ట్ స్థానంలో ఓపెనర్‎గా ఇన్‎ఫామ్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్‎కు స్థానం కల్పించారు. ఇక, అంచనాల మేర రాణించడంలో విఫలమవుతున్న రొమారియో షఫర్డ్‎ను ప్లేయింగ్ లెవన్ నుంచి తప్పించింది ఆర్సీబీ. 

అతడి స్థానంలో స్టార్ పేసర్ జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. కీలకమైన క్వాలిఫయర్ మ్యాచుకు విధ్వంసకర సాల్ట్‎ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆర్సీబీ ప్లేయింగ్ లెవన్‎ను పరిశీలిస్తే బౌలింగ్ లైనప్‎ను పటిష్టం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భువనేశ్వర్‎, హేజిల్ వుడ్, రసిఖ్ సలాందార్‎లతో పేస్ దళం బలంగా ఉండగా.. వీళ్లకు తోడు జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నారు.