Chat GPT-5 త్వరలో లాంచ్!.. సామ్ ఆల్ట్మన్ చేతుల్లో కొత్త మోడల్

Chat GPT-5 త్వరలో లాంచ్!.. సామ్ ఆల్ట్మన్  చేతుల్లో కొత్త మోడల్

Open AI సంస్థ కొత్త AI మోడల్ను లాంచ్ చేయబోతోంది. ఇది గత మోడల్స్ కంటే మెరుగైన ఫీచర్స్ తో వస్తోంది..ఈ విషయాన్ని OpenAI CEO సామ్ అల్ట్ మన్ ప్రకటించారు. ఇప్పుడు తాను స్వయంగా వాడుతున్నట్లు చెప్పారు. త్వరలో ఈ మోడల్ అందరికి అందుబాటులోకి రానుందని చెప్పారు. రాబోయే చాట్ GPT5 మోడల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.. 

చాట్‌జీపీటీ-5 ఫీచర్స్.. 

ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ ఇంకా చాట్‌జీపీటీ-5ని అధికారికంగా విడుదల చేయలేదు. సామ్ ఆల్ట్ మన్ చెప్పిన వివరాల ప్రకారం.. చాట్GPT5 కీ ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. గత మోడల్స్ లో తప్పిదాలను సరిచేసుకుంటూ, అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ChatGPT మోడల్ వస్తోంది. 

సహజ భాషా ప్రాసెసింగ్.. చాట్‌జీపీటీ-5 మునుపటి వెర్షన్ల కంటే చాలా మెరుగ్గా హ్యూమన్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోగలదు. చాలా స్పష్టంగా సహజంగా ఆన్సర్ చేయగలదు. సంక్లిష్టమైన వాక్యాలను ,భావాలను కూడా ఇది సులభంగా విశ్లేషించగలదు.

ఇది కేవలం టెక్స్ట్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఫొటోలు, వీడియోలు, ఆడియోను కూడా అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు ఒక వీడియోను చూసి అందులోని సంఘటనల గురించి డిటెయిల్డ్ గా వివరించగలదు.

ఈ కొత్త వెర్షన్‌లో చాట్‌జీపీటీ-5 ఎక్కువ కన్వర్జేషన్లను గుర్తుంచుకోగలదు. ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.
ఇది కేవలం సమాచారాన్ని తిరిగి ఇవ్వడం కాకుండా క్లిష్టమైన సమస్యలను విశ్లేషించి, తార్కికమైన ఆలోచనలతో పరిష్కారాలను చూపగలదు. ఇది గణితం ,సైన్స్ వంటి క్లిష్టమైన రంగాలలో కూడా సహాయపడుతుంది.

►ALSO READ | WhatsApp:వాట్సాప్ బ్లాక్ ఆపరేషన్..98 లక్షల ఫేక్ అకౌంట్లు తొలగింపు

ఓపెన్‌ఏఐ ఈ మోడల్‌ను రూపొందించేటప్పుడు తప్పు సమాచారం (hallucinations) ఇచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేస్తుంది. దీనివల్ల చాట్‌జీపీటీ-5 మరింత విశ్వసనీయంగా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా యూజర్ల చిన్నపాటి ఇన్ ఫుట్ కూడా సంక్లిష్టమైన,మల్టిపుల్ టాస్క్ ను ఇది స్వయంచాలకంగా పూర్తి చేయగలదు.

OpenAI సంస్థ ఇప్పటివరకు అనేక రకాల చాట్ GPT  మోడల్స్ ను విడుదల చేసింది. GPT 3.5, GPT 4, GPT 4 0, O సిరీస్ వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా Chat GPT5 ని లాంచ్ చేసేందుకు అల్ట్ మన్  సిద్దమయ్యారు. 

ఈ లక్షణాలు ChatGPT5ను మరింత శక్తివంతంగా ఉపయోగకరమైన సాధనంగా మార్చగలవని నిపుణులు భావిస్తున్నారు. అయితే అధికారిక విడుదల తర్వాత మాత్రమే దీని వాస్తవ సామర్థ్యాలు పూర్తిగా తెలుస్తాయి.