
వాట్సాప్ యూజర్లకు షాక్..ఇందులో వాట్సాప్ ఒక్క నెలలో దాదాపు98 లక్షల యూజర్ అకౌంట్లను తొలగించింది. ఫేక్ న్యూస్, మిస్ ఇన్ఫర్మేషన్, మాల్వేర్, స్పామ్ లింకులు, గ్రూపుల ద్వారా విద్వేష ప్రచారం, మానవ అక్రమ రవాణా, ఫ్రాడ్, ఫేక్ ప్రొఫైళ్లు,యూజర్ కంప్లైంట్ల ఆధారంగా వాట్సాప్ ఈ ఖాతాలను తొలగించింది.
నెలవారీ చర్యల్లో భాగంగా జూన్ నెలలో వాట్సాప్ 98లక్షల45వేల ఫేక్ ఖాతాలను తొలగించింది. ఇందులో కస్టమర్లు ఫిర్యాదు చేయకుండానే వాట్సాప్ తన స్వంత ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా దాదాపు 33 లక్షల ఖాతాలను ముందే గుర్తించి తొలగించింది.
కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా అనేక ఖాతాలపై చర్యలు తీసుకుంది. జూన్ నెలలో వాట్సాప్‌కు మొత్తం 23వేల596 ఫిర్యాదులు అందగా వాటిలో 16వేల069 ఖాతాల తొలగింపుకు సంబంధించినవి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత 1,001 ఖాతాలపై చర్యలు తీసుకుంది.
తొలగింపుకు గల కారణాలు..
ఈ ఖాతాలను తొలగించడానికి ప్రధాన కారణాలు వాట్సాప్ నిబంధనలు,షరతులను ఉల్లంఘించడంతో ఈ ఖాతాలను తొలగించారు. స్పామ్ ,ఫేక్ మేసేజ్ లు పంపడం, ఫేక్ న్యూస్ ,తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, మానవ అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, ద్వేషపూరిత ప్రసంగాలు (hate speech) ,హింసను ప్రోత్సహించడం, మోసపూరిత కార్యక్రమాలు నిర్వహించడం, అనధికారిక GB WhatsApp ఉపయోగించడం వంటి కారణాలతో ఈ ఖాతాలను రిమూవ్ చేశారు.
►ALSO READ | OpenAI: ఉద్యోగుల వాటాలు అమ్మే ప్లాన్‌లో ఓపెన్ ఏఐ.. టార్గెట్ రూ.42 లక్షల కోట్ల విలువ..!!
కొత్త ఐటీ నియమాలు, 2021కి లోబడి వాట్సాప్ ప్రతి నెలా సమర్పించే కంప్లయెన్స్ రిపోర్ట్‌లో భాగంగా ఈ తొలగింపులు చేసింది. ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా,విశ్వసనీయంగా ఉంచడానికి వాట్సాప్ ఈ రకమైన చర్యలను నిరంతరంగా కొనసాగిస్తుంది.
కస్టమర్ సెక్యూరిటీ, పర్సనల్ డేటాకు ప్రాధాన్యతనిస్తూ అడ్వాన్స్డ్ AI సిస్టమ్స్ రివ్యూ ద్వారా చట్టవిరుద్దమైన, హింసాత్మకమైన, హానికరమైన కంటెంట్ ను గుర్తించి తొలగిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.